Friday, July 29, 2011

ఆక్రోశం - ఆవేదన

ఇన్ని రోజులు బ్లాగ్స్ లో బుడుగు గొడవ (బాపు-రమణ) , విశ్వనాధ సత్యనారాయణ, సిరివెన్నెల, వేటూరి లాంటి పండితుల గురించి చదివుతుందే వాణ్ణి ఈరోజు మొదటి సారి ఇక్కడ కూడా ప్రపంచం లో ఉన్న అన్ని ఆవ లక్షణాలు ఉన్న బ్లాగ్స్ చదివా అదీ తెలంగాణా గురించి. తెలంగాణా వాళ్ళని ఒక ఆంధ్ర రచయత తెలిబాన్స్ (తాలిబాన్ కి సొంత పైత్యం) అంటే దానికి ఆంధ్ర వాళ్ళని ఒక తెలంగాణా రచయితా అజాకర్స్ (రాజాకర్స్ కి వీరి సొంత పైత్యం) అని కొనసాగింపు . ఈ బ్లాగ్స్ లో రాసిన ఇద్దరు అధ్యాపకులు, పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో విద్యార్దులను తీర్చిదిద్దాల్సిన బృహత్ భాద్యతని bujala మీద మోస్తున్న అధ్యాపకులు.
నా దృష్టిలో టీచర్స్ స్థానం చాల పైన వాళ్ళు వాళ్ళ విద్యార్ధులకి ఒక లైట్ హుసే లా ఎప్పుడు సరైన దరి చూపిస్తూ దారి తప్పే వారిని దరికి తెస్తూ ఉన్నత శిఖరాల పైన వాళ్ళ విద్యార్దులని చూసి అదే వాళ్ళ విజయంగా ఆనంద పడేవారని నా అభిప్రాయం. తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ కలిసుండాల విడిపోవాలా, కలిసుంటే నష్టాలేంటి/ లాభాలేంటి అనే వాటి గురించి మాట్లాడేంత అనుభవం గాని విషయ పరిజ్ఞానం గాని నాకు లేవు, కానీ స్టూడెంట్స్ ని తప్పుడు మార్గం నుంచి సరిద్దిదాల్సిన వారె కంచే చేను మేసిన చందంగా ఇలా ఒకరినొకరు తిట్టుకుంటే కుదిర్తే కొట్టుకుంటే ఇక స్టూడెంట్స్ ని ఎవరు పట్టించుకుంటారు వాళ్ళకి వీళ్ళు ఏమి నేర్పిస్తారు, ఎవరు మొదలెట్టారు ఎవరు ఆజ్యం పోసారు ప్రస్తుతానికి అప్రస్తుతం. గాంధీ ని జాతిపిత గ చెప్పుకు తిరిగే మనం ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి బదులు ఎదుటి వాడి రెండు చెంపలు పగలగొట్టే స్తితికి చేరాం అది ఆపాల్సిన టీచర్స్ తెలిబాన్/అజకర్స్ అంటే ఇంకా స్టూడెంట్స్ ఎందుకు వింటారు. ఆవేశం పక్కన పెట్టి ఎదుటి వాడి గురించి ఒక్క నిమిషం ఆలోచించమని చెప్పే టీచర్స్ ఎంతమంది, అంతమంది టీచర్స్( పై ఇద్దరి తో సహా ) అలాగే ఉంటె ఎంత బాగా ఉంటుందో కదా.............