సింగపూర్ కి వెళ్దామని చివరి వారం లో నిర్ణయించుకొని బయల్దేరం. వీసా రావడానికి ౩ రోజుల సమయం పడుతుందని తెలిసి 23న అప్లై చేసాం 29 రాత్రి కి బస్సు లో వెళ్దామని ప్లాన్. 26 తారిఖు కల వీసా వస్తుందనే ధిమాతో ఏదో మూలా వస్తుందో రాదో అని చిన్న అనుమానం, అదృష్టమో దురదృష్టమో అనుకున్నట్టుగానే 26నే వీసా వచ్చింది ;). దురదృష్టం ఎందుకన్నానో ముందు ముందు తెలుస్తుంది :).
వెళ్ళే ముందే అక్కడికి ముందే వెళ్ళిన నా స్నేహితులతో అక్కడి విశేషాలు, బస, సిటీ లో తిరిగే ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్న . Universal స్టూడియో తినే వస్తువులు బాగా కాస్ట్లీ అని తెలుసుకొని వెళ్లేముందే ఓ 100 ringgit తో biscuits, bread తీస్కోని బయల్దేరా. సామానంత సర్దేసుకొని ప్రయాణం రోజు బస్సు స్టాండ్ కి బయల్దేరా. 9:30 కి రావాల్సిన బస్సు 10:30 కి రాణే వాచింది (vachindi అని కవి హృదయం :)). బస్సు ఎలా ఉంటాడో అని అనుకుంటున్నా నా బయాన్ని పోగొట్టేల ఉంది బస్సు. మంచి మసాజ్ సీట్స్ తో.అలా 8 గంటల ప్రయాణం తర్వాత సింగపూర్ సరిహద్దులో immigration and customes check. passport లో బాగా జుట్టు ఉన్నపటి నా ఫోటో ని ఇప్పటి నా హెయిర్ స్టైల్ ని చూసి immigration అమ్మాయి, అమాయకంగా ఒక చూపి చూసి తనతో లోపలి తీస్కోని వెళ్ళింది, సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిన నన్ను తన ముందు కూర్చోబెట్టి ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళింది. సిగ్గు పడుతూ బొటనవేలు ని నెల కి రాస్తున్న నేను రూం లోకి ఎవరో ఇద్దరు బాగా బలంగా ఉన్న పెహల్వన్ లు రావడం గమనించలేదు, వస్తూనే wats ur name? wer r u frm? అంటూ ప్రశ్నల వర్షం మొదలెట్టారు, అప్పటి వరకు వేరే తరహ వర్షం లో తడిసి మోద్దవుతున్న నేను ఈ మనుషులని చూడగానే ముందు కంగారుపడి, తర్వాత bayapadi aa వెంటనే ఆలోచనలో పడ్డా, సీట్ కి ఉన్న cushion బానే ఉండటం వాళ్ళ ఈ పడ్డం తో దెబ్బలు తగల్లేదు, వెంటనే తమాయించుకొని సమాదానలివ్వడం మొదలెట్టా. వాళ్ళు అడిగిన ప్రశ్నలు, నా సమాధానాలు ఇక్కడ రాయడం కంటే నా జీవిత చరిత్ర పుస్తకం రాయడం చాల ఈజీ. చివరకి అ ఫోటో లో ఉంది నేనే అని confirm చేసుకొని సింగపూర్ లోకి వదిలారు. సింగపూర్ లో మూడు రోజులు అనే సినిమా మొదటి సీన్ ఇంత బాగా వస్తుందని ఉహించని నేను, ఉపిరాడనంత ఆనందంతో immiggration ఆఫీసు బయటకి వచేసరికి నేను తెచిన biscuits, బ్రెడ్ ఉన్న బస్సు సింగపూర్ సిటీ మద్యలోకి చేరిపోయింది మమ్మల్ని సరిహద్దు దెగ్గరే వదిలేసి :(.
p2 నేను P1
ఇక్కడే అసలు ట్విస్ట్ కధలో, నాతో వచ్చిన ఇద్దరిలో ఒకడికి భయం, ఇంకొడికి డబ్బులు ఖర్చు చేయడం అంటే భయం, వాళ్ళని p1,p2 అని పిలుద్దాం ఈ కదా మొత్తం confusion లేకుండా. సింగపూర్ పొలిమేరాల నుండి బస కి వెళ్ళడానికి p2 MRT స్టేషన్ వెతకడానికి మా ఇద్దరినీ తీస్కోని ఒక 40 mins ఆ immigration ఆఫీసు చుట్టూ ప్రదక్షిణ చేపించి చివరికి నాకు నీరసం p1 కి ఆయాసం వచ్చాక, ఇంకా మా వాళ్ళ కాదు మహాప్రభో అని కాళ్ళ వెళ్ళ పడి టాక్సీ లో బయల్దేరం. బస కి చేరే వరకు మా ఇద్దరి వంక ఒక పది హత్యలు చేసి తీహార్ జైలు లో శిక్ష అనుబవిస్తున్న ఖైదిల్లా చూడటం మొదలెట్టాడు p2 .అక్కడనుంచి రూం కి చేరుకొని ముందు తిని కొంచెం ఓపిక వచ్చాక స్నానం చేసాం అనిపించి ఊరు చూడటానికి బయల్దేరం ఇంతలోనే రిటర్న్ టికెట్స్ మిస్ అయ్యాయని p2 బాంబు పేల్చాడు, ఎం చేయాలో అర్ధం కాకా ఆ బస్సు agent కి ఫోన్ చేసి వాడి ఆఫీసు వెతుక్కుంటూ బయల్దేరం. ఓ అరగంట నడిచి చివరికి ఎలాగో వాడి ఆఫీసు పట్టుకొని దుప్లికాతే టికెట్ తీస్కున్నం. ఇందాకటి p2 చూపుకే తట్టుకోలేని మేము మళ్ళి టాక్సీ అంటే వాడు ఈ టాక్సీ కిందో తోసేస్తాదేమో అని బయపడి వాడి వెనకాలే నడుస్తూ MRT స్టేషన్ కి వెళ్లి రైలేక్కం క్లార్క్ quay అనే ప్లేస్ కి . ఇక్కడ p1 వాడి DSLR కెమెరా తో వాడి ఫోటోగ్రఫి skills చూపించడం మొదలెట్టాడు, తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి అలా కనిపించిన ప్రతిదాని ముందు నిలబడి వెనక ఉన్న వాటిల నిలబడి పోస్లివ్వడం భరించలేక ఎలాగో avoid చేయాలనీ నిర్ణయించుకొని దేగ్గర్లో ఉన్న బోటు షికార్ కి వెళదాం అని మొదలెట్టా. అనుకున్నట్టుగానే p2 ముందు దరెంతో కనుక్కో అన్నాడు నాకు చిర్రెతుకొచ్చి మీరు వస్తే రండి లేదంటే నేను వెళ్త అని బయల్దేరా చేసేదేం లేక నాతోనే వచేసారు. సింగపూర్ లో చూడదగ్గ ప్రదేశాలన్నీ ఆ నది వడ్డునే ఉన్నాయి. బోటు లో మధ్యలో దిగి నడిచి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం, నేను అడగ్గానే p1 ఒప్పెస్కున్నాడు వాడి కాకి ఫొటోస్ కోసం, p2 ఇక చేసేదేం లేక మాతో పాటే దిగేసాడు. అక్కడే సింగపూర్ నేషనల్ symbol Marlion statue , marina bay sands హోటల్, డబల్ హేలికాల్ బ్రిడ్జి, సింగపూర్ flyer ఉన్నాయి. ఆ బ్రిడ్జి ఎందుకో నాకు బలే నచ్చింది.
అలా ఆ రోజు ఆ నది తీరం లో ఉన్న అన్ని ప్రదేశాలను చుట్టేసి రూంకెళ్ళి పోయాం.మర్నాడు ఉదయం లేచి త్వరగా రెడీ అయిపోయి universal స్టూడియో కి బయల్దేరం. అక్కడ చూడటానికి పెద్దగా ఏమిలేదు, చిన్న పిల్లల attractions ఎక్కువ, కానీ రెండు roller costers మాత్రం బాగా ఉన్నాయి.
ఆ రోలరు కస్టర్ దెగ్గరే p1 తన భయాన్ని బయటపెట్టాడు, ఏ రైడ్ కి వెళ్దాం అన్నా నేను రాను మీరు వెళ్ళండి అనేవాడు ఏరా అంటే నాకు ఇక్కడే బాగా ఉంది అని వాడి కెమెరా తో ఫోటో తీయడం స్టార్ట్ చేసే వాడు దీనికంటే ఆ లైన్ లో నిలబడి ఏదో ఒక రైడ్ ఎక్కడం బెటర్ అని కనిపించిన ప్రతి రైడ్ ఎక్కడం మొదలెట్టా. ఆ రోజు సాయంత్రం సాంగ్స్ అఫ్ ది సి అని ఒక musical షో కి వెళ్లి రాత్రి కి రూం కి చేరుకున్నాం.
మర్నాడు ఉదయమే వినాయక చవితి కావడం తో గుడికేల్డం అన్నడు p1 , నాకు ఎందుకల అని పించింది నేను రాను మీరు వెళ్ళండి అనేస మళ్ళి వెంటనే సరేలే పండగ కదా సింగపూర్ లో అయిన శ్రీకాకుళం లో అయిన పండగ పండగే కదా అని విశాల హృదయంతో అలోచించి, వాళ్ళతో పాటే గుడి కి వెళ్ళాను. సింగపూర్ లో గుడి ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళిన నాకు ఇండియా లో కంటే పద్దతిగా పూజలు చేస్తున్న ఆ వాతావరణం నచ్చి ఆనందం తో బయటికొచ్చా . ఆ వినాయకుడు నా గుడికే రానంటావా అనుకున్నాడో ఏమో, బయట విడిచేసిన నా కొత్త షూస్ దర్శనం చేసుకొని వచేసరికి మాయం. సింగపూర్ లో కూడా గుడి బయట విడిచిన చెప్పులకి రక్షణ లేదని సంతసించిన వాడినై అక్కడి నుంచి నిష్క్రమించితిని.ఇంకా ఆ రోజు చైనా బజార్ లో షాపింగ్ అది చేసి ఆ రోజు రాత్రి కి మళ్ళి బస్సు ఎక్కాం.
నేను వెళ్ళిన అన్ని ప్రదేశాల్లోకి నాకు సింగపూర్ బాగా నచ్చేసింది.కాకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టల్సుంటుంది మిగిలిన ప్రదేశాలలో కన్నా (langkawi , bangkok , KL cameron వీటి తో పోలిస్తే ).
అల్లా కొంచెం కష్టం గా ఏంటో ఇష్టం గా మూడ్రోజుల సింగపూర్ యాత్ర ముగించాం.