Monday, December 5, 2011

అనగనగా ఓ SOC


onsite నుంచి రాగానే,అందరి లాగే chacolates @ mydesk అని మెయిల్ పెట్టా. ఎప్పుడు ఏది ఫ్రీ గ వస్తుంది అని ఎదురు చూసే నా TM తన సంచి త్జో సహా వచేసాడు, సరేలే మన TM ఈ కదా ఓ నాలుగు ఎక్కువ తీస్కున్న పర్లేదు అని చూస్తున్న నాకు షాక్ ఇస్తూ 4 మిగిల్చాడు, ప్రాజెక్ట్ లో మిగిలిన 16 మందికి. మిగిలిన నాలుగిట్ని౧౬ ముక్కలు చేసి తిరుపతి ప్రసాదం లా పంచా, ఈ పాటి ముక్క కి మళ్ళి మెయిల్ బొక్క అని కొంత మంది మనసులో (నాకు వినపడేలా...) అనుకుని ముక్క నోట్లో వేసుకొని, ముక్క (అదే chacolate ముక్క) దాత సుఖీభవ అని దీవించి వారి వారి ఉచితాసనలలో ఆసీనులై, ఎప్పట్లాగే మానిటర్ ని చూస్తూ mouse ని కదిలిస్తూ ప్రపంచాన్ని ఆ mouse కదలికలతో కంట్రోల్ చేస్తున్నంత buildup తో పనిలో మునిగిపోయారు. ఒక సంవత్సరం తర్వాత ఇండియా ఆఫీసు వచేసరికి ఊరిమే ఉత్సాహంతో కాంపస్ మొత్తం తిరుగుదామని బయల్దేరిన నాకు ఎదురుగ TM . శకునం బాలేదని వెళ్లి నా cubicle లో కూర్చున్న. వెంటనే ఆయనే నా cube కి వచ్చి నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు. నాకు మీకు పర్సనల్ ఎంటి అనబోయి, మాట్లాడేది TM తో అని గుర్తొచ్చి మాటని మింగేసి అడుగు ముందుకువేసా. పాత NTR సినిమా  లో విల్లన్ డెన్ లా ఉండే ఆ కాన్ఫెరెన్స్ రూం కి వెళ్తూనే ఏవో చిన్న నాటి (అంటే ఓ సంవత్సరం ముందువి) చిలిపి పనులు గుర్తొచ్చి నవ్వుతున్న నన్ను ఒక ఇయర్ అరణ్యవాసం పంపిన నీకు బుద్ది రాలేదు అని ఆయనో చూపు, సమాధానంగా కుక్క తోక వంకర అన్నట్టు నేనో చూపు, వీడితో కళ్ళతో మాట్లాడితే క్లారిటీ లేదని నోటితో మాట్లాడడం మొదలెట్టాడు.


ఎప్పట్లాగే, అందరు managers లాగే you are very important resource, we have got very good feedback from customer about you, i want to give you the best work in the industry. next we are gonna work in a SOC project. Its state-of-the ఆర్ట్ SOC project, our company future is dependent on that projects success. అని ఆల్రెడీ బాగా prepare అయిపోయిన ఒక పేరాగ్రాఫ్ ని అప్పజెప్పి ఓ రెండు గ్లాసుల నిల్లు తాగాడు. నూతన్ ప్రసాద్ దేశం క్లిష్టపరిస్తితిలో ఉంది అని డైలాగ్ గుర్తొచ్చి వెంటనే నవ్వోచి ఇప్పుడు కూడా నవ్వితే అయన ఎదుస్తాదేమో అని గుర్తొచ్చి ఆయనలాగే గంబిరంగా పేస్ పెట్టి ఉందా అయిపోయిందా అనట్టు చూస్తున్న నా వైపు అప్పుడేనా అన్నట్టు ఓ నవ్వు నవ్వి, ప్రాజెక్ట్ గురించి చెప్పడం మొదలెట్టాడు. మొదటి రోజే ఏంట్రా ఈ మోత అని మనసులో అనుకోని ఎంత బాగా చెప్తున్నారో అన్నట్టు చూస్తున్న నాతో so i hope you will be interested in this project, i will finalize your name and will inform everyone that you will be working in this project, from afternoon you can start working అంటూ ఈ రోజు కి ఇంతే సంగతులు అని న్యూస్ రీడర్ వార్తలు చదివినట్టు చెప్పేసి do you have anything to ask అంటూ ఎదవ ప్రశ్నవేసాడు, ఆల్రెడీ ఆకలిగా ఉన్న నేను మళ్ళి ఎడిన అడిగితె లంచ్ బ్రేక్ లో కూడా బ్రేక్ లేకుండా మాట్లాడగల అయన నైపుణ్యాన్ని తెలిసిన వాడ్ని కాబట్టి లేదు మహా ప్రభో మీరు ఎలా అంటే అలాగే అని బయటికి నడిచా.


అయన చెప్పినదాన్ని బట్టి చుస్తే అసలు ఇంట మంచి అవకాశం  మళ్ళి రాదేమో అనిపించింది. సరేలే ఇప్పటి వరకు ఇలాంటి project చేయలేదు కదా మనకు బాగా ఉంటది  అని ఆనందంగా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే పక్కనుండే ponnu (అరవం లో అమ్మాయి) చిలిపిగా చూస్తూ వెకిలిగా నవ్వినప్పుడైన గుర్తుపత్తల్సింది ఎక్కడో ఏదో తేడ జరిగుతుంది అని. లోకంలో నమ్మలేనిది ముగ్గురు Salesmen , Politicians  , Managers అన్న సత్యాన్ని నిజం చేస్తూ, అయన నిజ స్వరూపం త్వరలోనే తెలిసొచ్చింది

ప్రాజెక్ట్ మొదలైన మూడో రోజు నుంచే

రోజుకో రెండు స్టేటస్ కాల్స్ అంట, ఏనుగులతో తొక్కించాలి ఒప్పుకున్నా వాడ్ని.....
మేనేజర్ కి తెలివి లేదు lead కి బుర్రే లేదు....
దీనికి  తోడు భత్రుహరి చెప్పినట్టు ముర్ఖుడ్ని మార్చలేం అనేందుకు example గా బాగా తెలివైన ఒక భీకర consultant ,

పరమానందయ్య శిష్యులు ఎంత తెలివైన వాళ్ళో చూడలేదు కానీ, మరో ప్రదేశం లో పని చేస్తున్న ఆ engineers  మాత్రం వాళ్ళని మించి పోయే తెలివితేటలు కలిగి ఉన్నారు.

చూడాలి ఎన్ని రోజులో ఇలా.............