Thursday, February 21, 2013

ఎవరిని నిందిద్దాం

21/2/2013 సాయంత్రం 7:20 టీవీ పెట్టగానే మొదట కనపడిన వార్త హైదరాబాద్ లో బాంబు పేలుడు. 15 మంది మృతి 37 మందికి తీవ్రగాయాలు.
వార్తా చూడగానే మొదట కోపం, ఉక్రోషం బాధ, ఎవరిమీద??

టీవీ లో వార్తలు చూస్తున్న, ఒక ఆవేశ పూరిత ప్రసంగం " ఇది కేవలం పోలిసుల వల్లే జరిగింది, ఇంటిలేజన్సు రిపోర్ట్ సరిగాన్నే ఉందంట  మొన్నే హైదరాబాద్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ పంపారంట కాని పోలీస్ లు ఏమి చెయత్లెదు. గత మూడు నెలలుగా రెక్కి చేస్తున్న్రంతా పోలీసులకి ఏమి తెలిద ఎం చేస్తున్నారు?" ఇలా సాగుతుంది. 

ఇంకో న్యూస్ ఛానల్ "5 గురు ఉన్న కుటుంబం రోడ్ దాటుతుంటే ముగ్గురు చనిపోయారు, ఆ చిన్న పిల్లలకి ఎవరు ఆసరా ఎవరు ఈ పిల్లల బాగోగులు చూస్తారు". పక్కనే గాయపడిన వ్యక్తి తో "ఈ ప్రమాదం ఎలా జరిగింది? అప్పుడు మీరు ఎం చేస్తున్నారు? మీకు ఎవరిమీదైన అనుమానం ఉందా?" ఇలా సాగుతుంది

మరో దాంట్లో " కేంద్ర మంత్రి పేలుడు ని ఖండించారు ఇలాంటివి జరగకుండా చూడాలని పోలీసులకి చెప్పాం, చనిపొయిన వాళ్ళకి 6 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 1 లక్షా ఎక్ష్ గ్రతియా  ఇస్తాం చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం" ఇలా. 

ఎవరిని నిందిద్దాం? పోలీసులన? రాజకీయ నాయకులనా? ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ నా?

పక్కవాడు ఎలా పొతే నాకేంటి లే,  నా దాక వస్తే అప్పుడు చూద్దాం లే అనుకునే నాలాంటి సగటు ప్రజలనా?