Wednesday, July 29, 2015

ఆకలి మహాప్రభో



    Traffic మూలంగా 6 కి రావల్సిన వాడిని 8 అయిపొయింది, ఇంటికి వచ్చాక వండుకుందాం  అని చూస్తే నిన్న కడగకుండా ఉన్న గిన్నెలు ప్లేట్ ఎక్కిరిస్తూ కనిపించాయి. సర్లే ఇప్పుడు కడిగి వండి తినేలోపు లేట్ అయిపోతుందని డిసైడ్ అయిపోయి ఆన్లైన్ లో ఆర్డర్ చేద్దామని swiggy.com ఓపెన్ చేశా (నేనుండే ఏరియా లో ఫుడ్ డెలివరీ app ఈ మద్యే కొత్తగా మొదలైంది). దేగ్గర్లో ఉన్న restaurant అయితే త్వరగా తెస్తాడు అని డిసైడ్ అయి ఓ 1 km దేగ్గర్లో లో ఉన్న restaurant  choose చేస్కొని బాగా తొందరగా తయారయ్యే వాటిని ఆర్డర్ చేసి వెయిట్ చెస్తున్న. ఇంతలో ఫోన్ లో మెసేజ్ "your  order will  be delivered ఇన్ 30 mins" అని. పక్కనే ఉంది కదా పోనీ పోయి తెచుకుందాం అనుకున్న బండి లో petrol లేదన్న విషయం గుర్తొచ్చి వంటికి నీరసం వచేసింది. పోన్లే ఒక 20 mins తర్వాత కాల్ చేసి రెమింద్ చేద్దాం తొందరగా తెచేస్తాడు అని laptop లో సినిమా చూడటం మొదలెట్టా lap కాలాక కాని తెలిలేదు ఫుడ్ ఆర్డర్ చేసి 45 నిమిషాల పైనే అయిందని వెంటనే ఫోన్ చేస్తే delivery బాయ్restaurant దెగ్గరే ఉన్న సర్ ఆర్డర్ ఇంకా రెడీ అవలేదు అని కన్నడ లో చెప్పాడు సర్లే ఒక 10 mins లో తీస్కు రా అని నాకు వచ్చిన కన్నడ లో చెప్పి ఫోన్ పెట్టెసా. మళ్ళి మూవీ లో లీనమయ్య lap మళ్ళి కాలింది టైం చూస్తే లాస్ట్ టైం ఫోన్ చేసి ఆల్రెడీ 20 mins అయింది, ఎక్కడలేని కోపంతో తిట్టేద్దామని ఫోన్ చేశా డెలివరీ బాయ్ కి తనకి ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్ధం కాట్లేదు, నాకు కన్నడ లో తిట్లు రావు. చివరికి ఎలాగో నా బాధ మాత్రం చెప్పి ఇంకో 10 mins లో ఫుడ్ రాకపోతే బాగోదని deadly వార్నింగ్ ఇచి ఫోన్ పెట్టేసా మళ్ళి లాప్ కాల్చుకోడం కష్టం గా అనిపించి సినిమా చూట్టం ఆపేసి గడియారం వైపు చూస్తూ 10 నిమిషాలని 10 యుగాలుగా గడిపేసా, 10 యుగాల తర్వాత కూడా డెలివరీ బాయ్ జాడ లేదు. ఇలా కాదని swiggy కస్టమర్ కేర్ కి ఫోన్ చేశా complaint చేద్దామని. yeah సరిగ్గా ఉహించినట్టె నాతొ ఒకటి నుంచి పది వరకు అంకెలన్నీ నొక్కించి, ఓ పది నిమిషాల తర్వాత ఓ కమ్మనైన స్వరం హలో అంది, హమ్మయ్య మాట్లాడానికి మనిషి, ఆది ఆడ మనిషి అంత అందమైన గొంతుతో "హాయ్ సర్ స్వాతి here am  i  talking తో ranjith?" నా పేరు తను పలికేప్పటికి ఆనందం తో కన్నీళ్ళు కారుస్తూ ఎం మాట్లాడాలో మర్చిపోయి అలా ఉండిపోయిన నాతో తను  "ప్లీజ్ let me know how may i help now?" అంది, కొంచెం స్పృహ లోకొచ్చి  మాట్లాడేలోపు బీప్ బీప్ బీప్ శబ్దం తో ఫోన్ కట్ అయింది ఏంటి విపరీతం అని మళ్ళి డయల్ చేస్తే ఇప్పుడింకో ఆడ గొంతు "నీ ఫోన్ లో బాలన్స్ అయిపొయింది చూసుకోరా వెధవ" అని కొంచెం గౌరవంగా చెప్పింది అన్ని ఆడ గొంతులు మనకు కావలసినట్టు తియ్యగా ఉండవని తెలుసుకొని ఫోన్ recharge చేసేలోపే కాల్ ఒక తెలియని నెంబర్ నుంచి, swiggy నుంచే అని ఆనందం తో కాల్ ఎత్తితే, ఫోన్ swiggy నుంచే కాని ఈసారి మగగొంతు, నాలోని అపఅపరిచితున్ని నిద్రలేపి ఆర్డర్ ఇంకా రాలేదు అని బాగా తిట్టి ఫోన్ పెట్టి ఓ litre మంచి నీళ్ళతో ఆకలి వేడిని చల్లార్చా ఇంతలో ఇంకో కాల్ సర్ మీ అడ్రస్ తప్పు ఇచ్చారు అని ఈసారి delivery బాయ్, బాబు కి నాకొచ్చిన కన్నడ లో అడ్రస్ చెప్పా వాడు వాడికి అర్ధమైన అడ్రస్ కి వెళ్లి మళ్ళి కాల్ సర్ డోర్ ఓపెన్ చేయండి సర్ అని అబ్బా ఎట్టకేలకు సాదించా అని డోర్ ఓపెన్ చేసి చుస్తే పక్కింటి కుక్కపిల్ల వాడి ఓనర్ తో ఆడుతుంది. ఇంట్లో మారిన కొత్తలో కుక్కలంటే బయముండేది కాని కుక్క ఓనర్ తో మాట్లాడాక కుక్కని చూసినపుడు దైర్యం వాడ్ని చుస్తే బయం కలిగేవి ఇప్పుడీ కుక్క నుంచి తప్పించుకోడం ఎలాగా అని ముందసలు డెలివరీ boy ఎక్కడ అని చూస్తుండగా నా ఫోన్ మళ్లి మోగింది, సర్ ఇంట్లో మేడం ఉన్నారు ఆర్డర్ చేయలేదు అని చెప్తున్నారు సర్ మేడం తో మాట్లాడండి అని నేను చెప్పేది విన్పించుకోకో , విన్నా అర్ధం కాకో ఎవరో అమ్మాయి కి ఫోన్ ఇచ్చాడు. ఆల్రెడీ రెండు గంటల నుండి తిండి కోసం ఎదురుచూస్తూ ఉన్న నేను ఆడ గొంతా, మొగ గొంతా అని ఆలోచించెంత ఓపిక లేక మాములుగా ఆ ఆడగొంతు తో మాట్లాడి బాబు వేరే అడ్రస్ కి వెళ్ళాడని అర్దమై ఫోన్ బాయ్ కి ఇమ్మని ఈసారి ఇంకా క్లియర్ గా కన్నడ లో అడ్రస్ చెప్పెసా. ఎందుకైనా మంచిదని వాడ్ని ఫోన్ లో లైన్ లోనే ఉండమని వచ్చే దార్లో ఏమేమి కనిపిస్తున్నాయో చెప్పు అన్నా వాడు ఒక నిమిషం అలోచించి సర్ ఫోన్ లో బాలన్స్ అయిపోద్ది సర్ అన్నాడు, ఆల్రెడీ కోమా కి జానడు దూరం లో ఉన్న నేను వాడితో వాదించే ఓపిక లేక నా ఫోన్ రీఛార్జి చేద్దాం అని, ఆ పని పూర్తీ చేశా. వెంటనే బాబు కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నదో కనుక్కున్నా. వెంటనే వాడు సర్ మీరు చేసిన ఆర్డర్ కాన్సుల్ చేసారంట సర్ అన్నడు. ఆర్డర్ కాన్సుల్ చేయడమేంటి ఎవరా కూత కూసింది అన్నా, సర్ మెసేజ్ వచ్చింది సర్ నాకు మీ మొబైల్ కూడా వచ్చిఉంటది చుడండి సర్ అన్నాడు. ఈ హడావిడి లో నాకో మెసేజ్ వచ్చిన విషయం గమనించ లేదు చుస్తే " order got cancelled as you gave wrong address" అని ఉంది, కోపం నాశలనికంటే కొంచెం పైకే అంటింది ఇలా కాదని మళ్ళి కస్టమర్ కేర్ కి కాల్ చేద్దామని కాల్ చేశా ఈసారి ఈ గొంతైనా రెచ్చిపోవాలని ముందే అనుకుని నెంబర్లన్ని నొక్కి "హాయ్ సర్ స్వాతి here am  i  talking తో ranjith?" స్వరం విని కాల్ చేసింది నేనే అని చెప్పాక  "ప్లీజ్ let me know how may i help now?" అంది, స్టొరీ మొత్తం ఒక పావుగంట విన్న తర్వాత "let me check sir please be patient for 10mins" అని అర్ధం పర్దం లేని music ఏదో పెట్టి ఒక 10mins తర్వాత చావుకబురు చల్లగా చెప్పింది సర్ మీరిచ్చిన అడ్రస్ కి వెళ్ళిన boy తప్పు అడ్రస్ సిచారు అని చెప్పాడు అందుకే order cancel అయింది అని. ఏమి మాట్లాడాలో తేలిక ఆర్డర్ రెడీ గా ఉంది కదా నేను అడ్రస్ చెప్తాను వచ్చి ఇచ్చేయమన్నా దానికి తను "we cannot do that sir as your order stands cancelled" అని ఫోన్ పెట్టేసింది నేను తర్వాత ఎం చెప్తానో కూడా వినకుండా.  ఇంకా దెబ్బలాడే ఓపిక లేక, ఫోన్ బిల్ కి బయపడి బయటికెళ్ళి తినేసి వద్దాం అని బయటికొచ్చి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి చూస్తున్నా ఎంతకీ పైకి రాదే ఇంతలో కింద నుంచి watchman కేక sir లిఫ్ట్ పనిచేయట్లేదు అని. ఏమి చేయాలో తేల్చుకోలేక అక్కడే నిలబడి దిక్కులు చూస్తున్న నాకు కింద నుంచి రొప్పుతూ పైకొస్తున్న ఓ వ్యక్తి ఎదురొచ్చి నా ఫ్లాట్ వైపు నడుస్తున్నాడు. ఎవడా అని చుస్తే delivery boy. వెంటనే వెళ్ళి almost పార్సెల్ గుంజుకున్నంత పని చేసి డబ్బులిచ్చా. బాయ్ ని చూడగానే అప్పటి వరకు ఉన్న కోపమంతా మాయమైపోయింది షర్టు అంతా చెమటతో రొప్పుతూ 4 అంతస్తులు ఎక్కి వచాడు పాపం. జాలితో అప్పటివరకూ నేను తింటున్న biscuit ప్యాకెట్ లోనుంచి ఓ రెండు biscuits,తాగడానికి మంచి నీళ్ళు  ఇచ్చి ఎం జరిగింది అని అడిగా అప్పుడు తెలిసింది పక్క వీధిలో మా అపార్ట్ మెంట్ పెరుతోనే ఇంకో అపార్ట్ మెంట్ ఉందట అక్కడికెళ్ళి వస్తున్నాడట అందుకే లేట్ అయింది అన్నాడు. ఇందాకా ఆర్డర్ కాన్సుల్ అన్నావు కదా ఇప్పుడు ఎలా తెచావ్ అన్నా, మీతో మాట్లాడుతుంటే ఆకలిగా ఉన్నారనిపించింది సర్ అందుకే మళ్ళి వెతుకుదాం అని వచ్చా సర్ ఈ సరి దొరికింది అన్నాడు. ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు ఒక్క క్షణం వెంటనే ఇంట్లో కి పిలిచి ఆర్డర్ చేసిన ఫుడ్ ని పంచుకుందాం అన్నా ముందు మొహమాటం తో వద్దు అన్నా, బాగా అలిసిపోయి ఉన్నాడేమో వెంటనే సరే అనేసి మొహమాటం గానే కొంచెం తినేసి వెళ్ళిపోయాడు, నా కడుపు నిండలేదు కాని హాయిగా నిద్రపోయా.