Wednesday, May 4, 2011

room mate - Aha na pellanta cinema

room mate ni తెలుగు lo ఏమంటారు? ఏమో నాకు తెలిదు నా ఈ ప్రస్తుత పోస్ట్ కి పై ప్రెస్న కి ఎటువంటి సంబంధం లేదు. మరి అలాంటప్పుడు ఆ ప్రెస్న ఎందుకు అనే చచు ప్రేశ్న వస్తే మీరు ఈ పోస్ట్ చదవడానికి అర్హులే ఇక చదవండి.

ఆహా న పెళ్ళంట అనే జంధ్యాల సినిమా మీలో ఎంత మంది చూసారు? చూసారా ఆ చిత్రం గురించి చెప్తూనే మీ పేదల మీద నవ్వు వచ్చింది. ఆ చిత్రానికి పైన టైటిల్ కి సంబంధం ఎంట అని ఆలోచిస్తున్నారా , లేదు ఆ చిత్ర విజయానికి నా పోస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు కానీ అందులో కోట గారి ఆహార్యం సంభాషణలు చేష్టలు చూసి అనుకున్న ఆలా ఈ లోకంలో మానవుడెవడైన ఉంటాడ అని అనుకునే వాణ్ణి, బహుశా అసుర సంధ్య వేల అనుకోని ఉంటా తదాస్తు దేవతలు తదాస్తు అని ఉంటారు. ఆ కోరిక త్వరలోనే తీర్చారు, అది కూడా దేశం కానీ దేశం లో, అంటే మన దేశం లో కాదని. ఇప్పుడు లెక్క ప్రకారం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అదేదో తెలుగు సినిమా review లో చదివా ఫ్లాష్ బ్యాక్ ఎంత భయంకరంగా ఉంటె సినిమా అంత హిట్ అని, ఇప్పుడు నేను చెప్పా బోయేది కూడా అలంటి ఒక ఫ్లాష్ బ్యాక్.
అది అక్టోబర్ (15) 2010, మొదటి సారి దేశం దాటి పరాయి దేశం వచ్చా onsite కోసమని. వచ్చే ముందే ఇక్కడ కనుక్కున్నా ఎవడైనా మన దేశం వాడు ఉన్నదేమో అని, అదృష్టమో దూరద్రుష్టమో ఒకడు తగిలాడు, వాడి మాటలు చేష్టలు చూసి అయిన తెలియాల్సింది ఇల్లాంటి వాడిని ఏదో సినిమా లో చూసానే అని , కొత్త దేశం కదా కొంచెం అరగడానికి టైం పట్టింది.
ఆ ఆగంతకుడు నేను కలిసి ఒక ఫ్లాట్ తీస్కున్నాం మొదటి రెండు రోజులు అల్ హాప్పీస్ తర్వాత మొదలయ్యాయి నా బాధలు. షాపింగ్ కి తీస్కెళ్ళి వదికి ఇష్టమైన వాణ్ణి కొనుక్కొని బిల్ common అన్నాడు సరేలే నాకు ఫ్లాట్ వెతికి పెట్టిన పుణ్యానికి వదిలేద్దాం ani వదిలేస. ఇక రోజు రోజుకి వాడి ఆగడాలకి అంతు లేకుండా పోయింది, ఫ్లాట్ lo వాటర్ పురిఫిఎర్ లేదు అది తెద్దాం అంటే అంత ఖర్చు ఎందుకు అన్నాడు, నాకు ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు, తినే తిండికి తాగే నీళ్ళకి పిల్చే గాలి కి కూడా కక్కుర్తే ఏంట్రా అనుకున్న, అదృష్టం బాగా ఉంది గాలి ఫ్రీ లేకపోతె గాలి పీల్చడం కూడా అపెవాడే.

ఇలా రోజులు భారంగా గడుపుతున్న నాకు ఒక రోజు వాడు ఇండియా కి వేల్తాడనే ఒక శుభవార్తః తెలిసింది. వాడు వెళ్ళేది మల్లి రావడానికే అనే విషయం మర్చిపోయి వాడు లేని ఆ పదిహేను రోజుల్ని బాగా పండగ చేస్తున్న. ఒకానొక అశుభ దినం రోజు తీస్కేల్లిన సామాన్లతో పట్టు ఒక పెట్ట ఎక్కువ పట్టుకోచాడు ఆహా ఏమి నా భాగ్యం మనవాడు ఇండియా నుంచి ఏదిఅయిన తినదానికి తేచి ఉంటాడు అని ఆనందపడ్డ వాడు ఆ పెట్టె ఎప్పుడు తెరుస్తాడ అని ఎదురు చూస్తూ, కానీ నా ఎదురుచూపులు ఒక వారం వరకు అలా ఎదురుచుపులుగానే ఉన్నాయి సరేలే ఆదివారం కోసం ఎదురు చూస్తున్నాడేమో అనే నేను ఏమి మాట్లాడలేదు. అలా నేన్ను ఎదురు చూసే ఆ ఆదివారం రాణే వచ్చింది అనుకున్నట్టే ఎప్పుడు నా గది దరిదప్పుల్లో ki కూడా రాని వాడు తలుపు కొట్టాడు ఇంకే పంట పండింది అని వెళ్లి తలుపు తీసు వాడి చేతిలో డబ్బాకి బదులు ఒక పుస్తకం చూసి కంగారు పడ్డ , ఏంట్రా అది అని అడిగేలోపే చెప్పడం స్టార్ట్ చేసాడు. వాడు ఇండియా నుంచి తెచిన పిండి వంటలు,పచళ్ళు ఆ book లో రాసాడు, ప్రతి దాని పక్కన, ఆ పదార్దం పేరు దాని బరువు రాసి ఉంది మొత్తం ఒక పాతిక దాక ఉన్నాయి , నాలో చిన్న కొన్ఫుసిఒన్ ఇవన్ని నాకెందుకు చూపిస్తున్నద అని మల్లి వాడె చెప్పడం స్టార్ట్ చేసాడు వాడు ఇండియా నుంచి తెచిన ప్రతి దాని విలువ నా ఫ్లాట్ లో ఉన్న ముగ్గురం షేర్ చేసుకుందాం అన్నాడు, వీడిని ఏమి అనాలో అర్ధం కాకా సరే రా ఇంతకీ ఏమి తెచావ్, ఎంతివ్వాలి అని అడిగితె నా కళ్ళు బయర్లు కమ్మేల o నెంబర్ చెప్పాడు, ఇదేంట్రా నువ్వు తెచిన అవకయలకి ఇంత ఖర్చ అని అడిగితె అప్పుడు చావు కబురు చల్లగా చెప్పాడు, వాడు తెచిన వస్తువుల విమాన (luggage) ఖర్చులు కూడా కలిపి చెప్పరా అని, ఒక్క సారి నా బుర్ర కరబయింది వాడు చెప్పిన ఖర్చు తో నేను ఇండియా కి వెళ్లి వాడు తెచినవి తినేసి రావోచు అంత అడిగాడు.
అలా వాడితో ఉండడం ఇష్టం లేక వేరే రూం వెతికే ప్రయత్నాలు ప్రారంబించా నా అదృష్టం ఆ తర్వాతి నెల వాడికి బదిలీ
అయి ఇండియా వెళ్లి పోయాడు.....

ఇంతకీ ఆ మానవుడి పేరు చెప్పలేదు కదా దవల్ వాడితో ఉంటె మనం దామల్

ఇలా తదాస్తు దేవతలా మీద రకరకాల అనుమనలుందే నాకు ఈ కోరిక తిరడంతో అప్పట్నుంచి ఈ చెడ్డ కోరికలు ఆ సమయం లో అనుకోడం మానేస...

No comments: