ఈ పుస్తకంతో ప్రేమలో పడ్డా. ప్రేమలో అంటే ఆలా ఇలా కాదు, రాధా కి కృష్ణ ప్రేమ లా.
ఎం చెప్పాలి ఈ అమరావతి కథలు పుస్తకం గురించి. ఇన్ని రోజుల తర్వాత చదివినందుకు బాధ పడ్డ ఇప్పటికైనా చదివినందుకు ఆనందం. నాకు నేనే చేసుకున్న గొప్ప ఉపకారం.
కొన్ని నవ్విస్తాయి, కొన్ని కవ్విస్తాయ్, కొన్ని ఏడిపిస్తాయి. అద్దం ముందు నిల్చోబెట్టి ఇదిగో ఇది నువ్వు ఇదే నువ్వు అని చూపించినట్టు ఉంటాయి. మనసుని పిండేసేవి కొన్ని, తేలిక చేసేవి కొన్ని. మన చుట్టూ జరిగేవే, మనలో జరిగేవే అన్ని. ఒక్కో కథలో మంచి వాక్యాలన్నీ రాద్దామని పెన్ను పుస్తకం తీస్కొని చదవడం మొదలెట్టానా, మళ్ళి కథంతా రాయడం ఎందుకని ఓ కథ తర్వాత ఆపేసా. పేరు అమరావతి కథలైనా ఇవి తెలుగువాడి కథలు, తెలుగు వాళ్ళు గర్వాంగా ఇవిగో ఇవి మా కథలు అని చెప్పుకునే కథలు.
రెండు గంగలు కథలో వర్షపు వర్ణణ ఇలా - సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలు చినుకు పడ్డ చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం. వర్షం లో కృష్ణ కలుస్తుంటే, కృష్ణ లో వర్షం కలుస్తుంటే వర్షం లో తానూ కలిసిపోయి చేతులు విప్పార్చి హాయిగా తడుస్తుంది. ఆకాశగంగ పనికట్టుకొని ఈ నెల తల్లి ని చల్లగా కౌగిలించుకుంటుంటే ఈ మనిషన్నవాడెవడు గొడుగు అడ్డం పెట్టనికి. కృష్ణాలో పడుతున్న వర్షాన్ని కళ్ళముందు నిలిపాడు మహానుభావుడు. ఏంటి గొప్ప వర్ణన.
ఒక రోజెల్లి పోయింది లో - పిచ్చయ్య గారు ఏవి సాధించలేదు తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు కానీ కాలనీ తెలీకుండా కాలంలో కలిసిపోయి బతికారు అది చాలదా? చాలడం లేదు చాల మందికి. ఆ చివరి వాక్యం చాలదు జీవితాన్ని సరిగ్గా జీవించడానికి.
వరద కథ లో - ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసుని కడగా లేకపోతున్నాయి. సమాజాన్ని నగ్నంగా కళ్ళ ముందు ఉంచినట్టు లేదు.
ఇలా ఎన్నో ఒక్కో కథ ఒక్కో ఆణిముత్యం, చదివిన వాళ్ళకి చదివినంత.

No comments:
Post a Comment