తనికెళ్ళ భరణి గారు చిన్నప్పుడు మాతృదేవోభవ సినిమాలో విలన్ గా తర్వాత మనీ సినిమా లో కామెడీ విలన్ గా, మరికొన్ని సినిమాల్లో నటుడిగా మాత్రమే తెలుసు, కొంచెం పెద్దయ్యాక అయన రచయత అని లేడీస్ టైలోర్ సినిమా కి కథ తనే రాసారని తెలిసింది, ఇంకా చాల సినిమా లకి కథలు మాటలు రాసారని చదివా. ఇలా ఆయనగుర్చి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోడం అయన మిద గౌరవం అభిమానం నాతొ పతే పెరుగుతూ వచాయి. అప్పుదెప్పుడో గ్రహణం అనే సినిమా తీసారని అందులో భరణి గారు ఉన్నారని విన్నాను (ఇంకా చూడలేదు). ఆ మధ్య నక్షత్ర దర్శనం అనే కవిత సంపుటి విడుదల చేసారని తెల్సి ఎలాగైనా చదవాలని అప్పటికి అనుకోని మరు రోజు మర్చిపోయి నా పనుల్లో నేను మునిగిపోయి ఉన్న. మొన్న ఓపెన్ హార్ట్ విత్ RK అనే కార్యక్రమం లో భరణి గారి ఇంటర్వ్యూ చూసి ఆయనగారి మిద ఉన్న అభిమానం పదిన్తలయింది. బాలు గారి పుణ్యమా అని మొన్న శివరాత్రి ముందు రోజు పాడుతా తీయగా కార్యక్రమానికి అతిథి గా వచ్చి శభాసు రా శంకర అని శివ స్తుతి చేస్తూ తెలంగాణా యాసలో శివునిపై పద్యాలూ చదవడం మొదలెట్టారు. నాలాంటి పద్యాల మీద ఆసక్తి ఉండి పాదానికి పది సార్లు brown నిఘంటువు చూసే వాళ్ళకి కూడా వెంటనే అర్ధమయ్యేలా ఆ పరమేశ్వరుని తత్వలని చిన్న చిన్న పద్యాలుగా వినేప్పటికి ఈ పుస్తకమైన చదవాలనే కుతూహలం మొదలయింది. Internet లో ఏదో చూస్తుంటే kinige website లో పుస్తకాల గురించి తెలుసుకొని ఈ పుస్తకం ఉందేమో చూసా, top selling books లో చూసి వెంటనే కొనేసి గంట లో ఉన్న 65 pages పూర్తీ చేశా
(తెలంగాణా యాస లో రాసిన ఏదో నాక్కొంచెం తెలంగాణా యాస మిద పట్టు ఉండడంతో చదవడం సులభం అయింది).
పెద్ద పెద్ద విషయాలని కూడా చిన్న చిన్న పదాలతో నాలాంటి వాళ్ళకి కూడా తత్వం వంటపట్టేల ఉన్నాయా పద్యాలూ (ఏమో వాటిని పద్యాలూ అనోచో కూడా నాకు తెలిదు)
అందులోని మూడు తత్వాలు (అన్ని బాగా ఉన్నాయి ఏదో మచుకి ఓ మూడు)
ఆదా చంద్రమ నెత్తిమీద
నీలో ఆదా ఏమో అమ్మాయే
పురా జ్ఞానివి నీకు సాటి ఎవరురా
శభాసు రా శంకర
అమ్మని చుస్తే ఆకలి
గంగామ్మని చుస్తే దూపు
అయ్యని చుస్తే బెఫికరు
శభాసు రా శంకర
ఎన్నో గుళ్ళల్లో దేవులాడి
యష్టోచి కూర్చుంటే
నా గుండెలో ఘల్లుమన్నావు లే
శభాసు రా శంకర
చదవడం పూర్తైన వెంటనే భరణి గారి మిద నాకున్న గోరంత అభిమానం కొండంత అయింది.ఆ కొండంత అభిమానం కింద నాలుగు లైన్లు రాసేలా చేసింది.
ఎంత సక్కగా రాస్తివిరో శివుని గూర్చి
విన్నాడంటే వాడు కరిగిపోతడీమో
కాటి నొదిలి నీ కాడికి వస్తాడేమో
శభాసు రా భరణి