Thursday, March 8, 2012

హోలీ కథ

పండగలంటే నా చిన్నప్పుడే, ఏదో హడావిడి excitement కొత్త బట్టలు,తల స్నానాలు, అమ్మ చేసే గారెలు. అన్ని పండగల్లో హోలీ మాత్రం సేపరాటే. కొత్త బట్టలు వేసుకొనే దైర్యం ఎవరు చేయరేమో. చిన్నప్పుడు నాన్నారు కల్లూరు లో ఉద్యోగం చేసేప్పుడు, కాంపస్ మొత్తం ఒక చోట చేరి పండగ చేసే వాళ్ళం. చైతు నేను సందీప్ అందరం కలిసి బాటిల్స్ లో వాటర్ కలర్స్ నింపేసి చల్లుకునేవాళ్ళం. నాన్న వాళ్ళతో కాంపస్ మొత్తం తిరుగుతూ అందర్నీ నిద్ర లేపి మరి రంగులు చాల్లే వాళ్ళం, ఉత్సాహవంతులు మాతో పటు మిగితా వాళ్ళ ఇంటికి వచేవాళ్ళు కొంతమంది లోపలే ఉండి లేమని పెద్ద వాళ్ళతో లేము అని చెప్పించే వాళ్ళు అలంటి వాళ్ళని ఎం చేయలేం అనుకోని లైట్ తీస్కోనే వాళ్ళం. నాన్నది  residential స్కూల్ కావడం తో స్టూడెంట్స్ అందరు ఇలాంటి అదృష్టం కోసం చూసేవాళ్ళు, వాళ్ళ టీచర్స్ మిద ఉన్న కసి అంతా హోలీ రోజు తీర్చుకునే వాళ్ళు. (నాన్న ఎప్పుడు స్టూడెంట్స్ ఫేవరెట్ సో నాన్న కి ఎప్పుడు ఆ అదృష్టం దొరకలేదు :)).ఇలా మధ్యానం వరకు రంగులు చల్లేస్కోని చొక్కాలు చిచేస్కోని ఇంటికి రాగానే తాతయ్య ఎంత అవతారం అనే చూపులని తప్పించ్కుంటూ పెరట్లోకి వెళ్లి అమ్మ చేతో తల స్నానం చేపించుకొని అయిపోయిదని పించుకొనే వాళ్ళం.అప్పట్లో గుడ్లు (eggs) కూడా రంగుల బదులు వాదోచు అనేంత జ్ఞానం లేకపోడం వాళ్ళ రంగులతో సరిపెట్టేసే వాళ్ళం (అప్పట్లో గుడ్డు అంటేనే అదేదో బ్రహ్మ పదార్దం అని మనం అలాంటివి తినడం కాదుకదా తాకినా తప్పే అనే తాతయ్య మాటలతో గుడ్డు వాడెంత జ్ఞానం లేదు).
కొంచెం ఎదిగాక ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ లో ఉంటున్న రోజుల్లో అప్పుడే కొత్తగా వచ్చిన స్వాతంత్రం, చేతిలో డబ్బులు, చుట్టూ స్నేహితులు సో పండగని పీక్ లో ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఇంటి పక్కనే ఉండే శ్రీను, రమణ ల తో కలిసి మా రూమీస్ తంగరాజ్,రాకేశ్ రాచ చేసే వాళ్ళం మాతో మా ఇంటి owner పిల్లలు కూడా కలిసే వాళ్ళు.అప్పుడే హోలీ కి రంగుల బదులు కోకాకోల,పెప్సి లాంటి రసాయనాలతో గుడ్డు లాంటి పదార్దాలు కూడా వాడవచని తెలుసుకున్న. మేమే కాకుండా మొత్తం షాదన్ కాలేజీ ఫ్రెండ్స్ అందర్నీ లారీల్లో తీస్కోచేవారు తంగ రాకేశ్, ఇంకా చెప్పేదేముంది తీస్కున్నోడికి తీస్కున్నత పుసుకున్నోడికి పుసుకున్నంత.హోలీ అదెప్పుడు పండగ చేసే owner మాత్రం స్నానం చేసేప్పుడు నిల్లు తక్కువగా వాడండి బాబు అసలే ఎండా కాలం అనేవాడు, అలాగే అంది అనేసి ఒక్కోడు గంట చొప్పున స్నానం చేసేవాళ్ళం.అంతా అవగానే సంగు భాయి బిర్యాని అనేవాడు పక్కనే ఉండే బావర్చి నుంచి పార్సెల్.ఇలా సాయంత్రం వరకు జీవితాన్ని ఎంజాయ్ చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మల్లి కాలేజీ.

ఇంకా   బాగా ఎదిగి మాస్టర్స్ కోసం గుజరాత్ కి మకాం మార్చాక హోలీ ఎంత పెద్ద పండగో తెలుసుకున్న,కేవలం రంగులతో, గుడ్లతో కాకుండా ఖర్చు లేకుండా హోలీ జరుపుకునే కొత్త పద్ధతి తెలిసింది ఇక్కడే.బురదలో కూడా బాల్ లేకుండా football ఆడడం కూడా తెలిసింది ఇక్కడే. కాలేజీ క్రికెట్ గ్రౌండ్ కి జనాలందరినీ గుంపులు గుంపులు గా తీస్కోచి అందర్నీ లైను లో నిల్చోబెట్టి తప ఆన్ చేసే వాళ్ళు మొదట్లో బుద్ది నిల్చున్న వాళ్ళందరూ ఓ పది నిమిషాల్లో బాగా తాగేసి ఊగే వాళ్ళలా పక్కవాళ్ళ మీద  పడడం, పక్కవాళ్ళు కింద పడడం వాళ్ళ మీద విల్లు పడడం క్షణాల్లో జరిగి పోయేవి. నా లాంటి అర్భకులని కూడా మధ్యలో ఎక్కడో మూట కట్టి పదేసేవాళ్ళు.కాలేజీ ఫెస్ట్ కి ఇచిన tshirt జనాలందరూ హోలీ కి వాడేవారు, మాములు రోజుల్లో అయితే దాన్ని చిమ్పడం కష్టమని. ఇలా స్టార్ట్ అయ్యే హోలీ matki  phod అని కృష్ణాష్టమి ఉట్టి కొట్టడం లాంటి దాంతో కంటిన్యూ అయ్యేది, హాస్టల్ లో వింగ్ కి ఒక టీం చొప్పున తక్కువ టైం లో ఉట్టి కొట్టే టీం ఆ రోజు కి విన్నెర్.అలా రోజంతా బురదలో పొర్లి mud bath లాంటిది చేసి రూం కి వెళ్లి వాటర్ బాత్ చేసే వాళ్ళం.
కాలేజీ నుంచి ఉద్యోగం లో జాయిన్ అయ్యాక వచ్చిన హోలీ కి HR ఒక చిన్న ముంత లో కుంకుమ ఇంకో దాంట్లో పసుపు తీస్కోచి టీం మేట్స్ అందర్నీ లైన్ లో నిల్చోబెట్టి హ్యాపీ హోలీ అని ఓ చెంపని రెడ్ ఇంకో దాన్ని ఎల్లో చేసిది,మేము చేసేదేం లేక ఆమె తెచిన పసుపు-కుంకుమ లని ఆమెకి కూడా పూసి హ్యాపీ హోలీ అని మేనేజర్ తో సహా అందరికి చెప్పి తిరిగేల్లి సీట్ లో కూర్చొని పని చుస్కోడం. తను పూసిన ఆ పసుపు కుమ్కుమకే ఇప్పుడు అయ్యో అందం పడిపోయిందే అనుకునే ఆడ colleagues చిన్నగా  ఉన్నప్పటి ఉత్సాహం లేదు colleage టైం లో ఉన్న హుషారు లేదు, ఏదో హోలీ రోజు రంగులు పుసుకోవాలి అని namesake ఏదో మమ అనిపించడం అంతే.  


ఇలా రంగులు,నీళ్ళతో మొదలైన హోలీ గుడ్లతో, బురదతో కంటిన్యూ అయి పసుపు కుంకుమ రేంజ్ కి చేరుకుంది.
హ్యాపీ హోలీ bytheway :) :)



No comments: