Thursday, March 8, 2012

బిస్కిట్ బాబు తో బాబు

శ్రీ లక్ష్మి గణపతి ఫిల్మ్స్ బిస్కెట్ బాబు తో బాబు -- గొప్ప action stunts suspense కలగలిసిన గొప్ప చారిత్రాత్మక
చిత్రం. బిస్కెట్ బాబు మా TM కి నేను పెట్టుకున్న ముద్దు పేరు.  గత మూడు సంవత్సరాలనుండి ఒకటే మాట అంటే అదేదో మాటమీద నిలబడే రకం అని కాదు, ఎవడు రాజీనామా చేయడానికి తయారైన అవే మాటలు  , customer ని గురించి భయంకరమైన feedback ఇచాడు నువ్వు లేకపోతె ఈ కంపెనీ లో ఒక దివిసన్ మూస్కోడమే, onsite పంపిస్తా, ఎం కావాలి చెప్పు ఆ చంద్రున్ని దింపమంటావా, లేకపోతె మార్స్ మీదకి ఓ జూలీ ట్రిప్ వెళ్లి వస్తావా చెప్పు ఎం కావాలి అంటూ అసలు జరగవని తెలిసిన అన్ని విషయాలు ఏకరవు పెట్టడం మొదలెడతాడు. ఎలా తెలిసొందో తెలిదు నేను కూడా రాజీనామా కి రెడీ అయ్యా అనే దృగ్విషయాన్ని పసిగట్టాడు,బహుశా భూకంపం వస్తుందని కుక్కకి employee resign చేస్తున్నాడని managers కి నాచురల్ గానే  తెలిసిపోద్దేమో.కొన్ని బిస్కెట్స్ వేయడానికి పిలిచాడు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉండడం వళ్ళ అయన ప్రశ్నలకి ఎలాంటి సమాదానం చెప్తే తొందరగా పని ముగించ వచ్చో ముందే ఒక పకడ్బంది వ్యూహం తో రెడీ గా ఉన్నా.

రొటీన్ కి భిన్నంగా నేను కాన్ఫరెన్స్ రూం అనబడే గోడౌన్ లోకి వెళ్ళగానే, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అని ఒక దీన మైన చూపు చూసాడు. కూర్చో అన్నట్టు చైర్ వైపు చూసాడు. పర్లేదు అని నిల్చోనే ఉన్నా త్వరగా వెళ్లి పోవచనే కక్కుర్తి తో. కూర్చో అని బాధగా చూసి నోటితో చెప్పేసరికి మరి బాగోదని కూర్చుంది పోయా. త్రిల్లెర్ మూవీ చూడానికి వెళ్లి టికెట్స్ దొరక్క పక్కనే ఉన్నా సెంటిమెంట్ మూవీ చూడడానికి వేల్లినోది లా తయారైంది నా పరిస్తితి. ఆయనతో యుద్ధం చేద్దాం అని కదన కుతూహలం తో బయలుదేరిన నాకు అయన మొహం చూసి ఎం మాట్లాడబుద్ది కాలేదు. రెగ్యులర్ గా అయన చెప్పే hikes , onsite లాంటివి మాట్లాడకుండా, ఎమైన చేస్తే ఉంటావా అని అడిగాడు, లేదు అన్నాను అంతే రెండు నిమిషాల్లో అయిపొయింది. ఆయనతో మాట్లాడడం ఆక్షన్ మూవీ లా ఉంటాదనుకున్న నేను ఇంట ప్రశాంతంగా సుఖాంతం అయ్యే సరికి ఆనందం గా బయటికొచ్చా.             
             

No comments: