అవును ఇది శేఖర్ కమ్ముల సినిమా చుసిన తర్వాత రాసిందే కాని దాని రివ్యూ మాత్రం కాదు. ఆ సినిమా ఎలా ఉన్న, ఎలా ఉందని అందరు అన్నా నాకు మాత్రం రెండు,మూడు విషయాలు బాగా అనిపించాయి. ఒక హీరో తన అమ్మ దెగ్గరికి వెళ్లి 'పొద్దునే లేస్తావ్ నాకేం కావాలో అన్ని దెగ్గరే ఉంది అన్ని చేస్తావ్, అందరికన్నా ముందే లేస్తావ్ అందరు పడుకున్న తర్వాత అన్ని సర్దేసి నిద్రపోతావ్ అసలు నీకేం కావాలి నేను ఎలా ఉంటె నీకు ఇష్టం' అంటే ఆ మదర్ నాకేం వద్దురా నువ్వు హ్యాపీ గా ఉండు అది చాలు అదే నాకు కావాల్సింది అంటుంది. శేఖర్ ని ఒక సారి గట్టిగ హాగ్ చేస్కొని ఒక థాంక్స్ చెప్పాలనిపించింది. ఒక casual conversation ని extraordinary emotion గా చుపించినదుకు ఆ థాంక్స్. సినిమా చూసి ఇంటికి రాగానే జ్ఞాపకాల దొంతర లో ఉన్న నేను, roommate తట్టి పిలిచే వరకు మరో ప్రపంచం లో ఉండిపోయా.
No comments:
Post a Comment