పెట్రోల్ ధర మల్లి పెరిగిందా? కాదు కాదు పెంచార? మన ప్రభుత్వం ఏమి చేసిన లోక కళ్యాణం కోసమే కదా అది ఈ పిచి జనాలకి ఎప్పటికి అర్దమవుద్దో. పెట్రోల్ ధర పెంచడం వల్ల ఎన్ని లాభాలో రాస్తే ఓ బుక్ అవుద్ది చెప్తే ఓ రోజవుద్ది. అన్ని చెప్పడం కష్టం కాని ప్రజలని విజ్ఞాన వంతులని చేయాలనే నా ఆశ ని చంపుకోలేక కొన్ని మాత్రం చెప్తా
పెట్రోల్ ధర పెరిగిందని జనాలందరూ సొంత వాహనాలు మాని ప్రభుత్వ రవణా వాహనాలు వాడడం మొదలేడ్తే కాలుష్యం మొతం తగ్గిపోదు, తగ్గినా కాలుష్యం మన ఆరోగ్యాలు బాగుపడి హాస్పిటల్ కి వెళ్ళే ఖర్చు ఉండదు కద, ఇదివరకు పెట్రోల్ ధర తక్కువని పక్కనున్న పచారి కొట్టుకి కూడా బండిమీద వెళ్ళే వాళ్ళు ఉబకయం సమస్యతో బాధపడకుండా చేసిన ఈ పప్రబుత్వాన్ని వేనోళ్ళ పొగడ కుండా ఉండగలమా, ఆ మాట కొస్తే పెట్రోల్ ధర పెరిగిందని ధరలు పెరిగితే మనం తక్కువ తిని ఆరోగ్యం గా ఉండాలనే కదా ఈ ప్రభుత్వ తాపత్రయం.
No comments:
Post a Comment