Sunday, August 18, 2013

రాజకీయ నాయకుడు

ఏమిరా ఎట్లునర్ర్  అంత మంచిదేనా మస్తు రోజులైంది రా భై కలిసి చెప్పుండ్రి ఎం చేస్తున్నారు ఎక్కడున్నారు

<ఫోన్ రింగ్ >
అరె వస్తున్నార భై ఇక్కడే దోస్తు గాని పెళ్లి సెప్పిన గదా పొద్దున్నే ఈ రోజు కాదు రా భై 
నన్నేం చేయమంటావ్ రా నేను మొన్ననే చేప్తిని గీ రోజు పెళ్లి ఉంది ర భై నాతోని గాదు అని అరే కూర్చుందాం రా భై అదేమన్న గంటల ఒదుస్తద కుర్సోని మాట్లాడుకోవలె పొద్దునే మొదలైతే 3,4 కి అయితది 
సరే రా భై రేపు మాట్లాడుకుందాం అరె చెప్పిన గదా రేపు పొద్దునే ఫోన్ చేయి రా భై ఆ సరే రా 
<>
అరె ఇదే పరేషాన్ ర భై పొద్దునే మొదలైతది ర భై మల్ల గింటికి పోయేది రాత్రి కి రా 
ఇంకేంది పెళ్లి అయింది రా, ఏమి రో కొంచెం పొట్ట వచ్చింది
కాలేజీ లో ఎట్లా ఉంటూటిమి రా  భై 

<ఫోన్ రింగ్ >
అరె అన్న నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటుఉన్ననే 
అరె  అట్లాగాదన్న మొన్నే చేప్తిని గాదె అరె అంతకి రాదన్న 
నేను మాట్లాడిన అన్న 
అరె కమిషన్ లేకుండా ఎట్లా అయితదే 
అరె మేము ఇచుకొవలె గదనే నీకు తెలిన్దేముంది చెప్పు
మొన్న ఒక మంత్రి ఏదో ఓపెన్ చేయ్నికి వచ్చి ఉండే వాడ్ని ఇంప్రెస్స్ చేయనికి బైక్ రాలీ చేయిస్తిని అరె అందర్నీ తోల్కపోయి అందరి గాడిల్ల పెట్రోల్ కొట్టిచి పోద్దుటి కెల్లి మా గల్లి మొత్తం తిప్పిన అన్న ఏడికెల్లి వసతి చెప్పు పైసల్
<>
చెప్పురా  భై  ఇంకేంది ముచట్లు తెలుసు గదా రా మా అయ్యా కౌన్సిలర్ ర బై నన్ను mla చేయాలనీ అయన కల  ర భై గందుకనే  యూత్.....  లా జాయిన్ అయన రా . పనేముంటది రా  ఏడేడ భూమి ఉందొ చూసుడు కొనుడు కొనిపిచుడు ఎవడైనా కిరికిరి చేస్తే సెటిల్ చెసుడు.

మీకేం చాతనైతది రా ఇయ్యన్ని చిన్నపడి సంది మా అయ్యని చూస్తున్న మాకే చేయనికి వస్తలే. మికేందిరా ac గదుల్ల గూర్చొని నొక్కుతుంటారు మల్ల ఉపన్యాసాలు ఇస్తారు పాలిటిక్స్ అంత కంపు అది ఇది అని. మీరేవడైన ఓటు ఎసిండ్రా  రా ఎప్పుడైనా అసలు వోటింగ్ మెషిన్ ఎట్లుంటదో ఏరకేనారా, మాటలకేముంది రా నేను చేప్త ఇంట్లనే కూర్చునే  మా అవ్వ చెప్తది. చదుకున్నొల్లు ఓటు ఎయ్యరు చదువు లేనోడికి ఓటు ఏయనికి పైసలు గావలె ఎదకెల్లి వస్తాయి రా ఒక్కో ఓటు కి 500-1000 కావలె రా, గన్ని పైసల్ తీస్కున్నా మనకే గుద్దుతాడని నమ్మకమే లేదు రా. మన దెగ్గర తీస్కుంటాడు అవతలోడు దెగ్గర తీస్కుంటాడు ఫుల్ గా తాగి పడుకుంటారు  ర భై, మల్లి అందర్నీ తోల్కపోవాలి పోలింగ్ స్టేషన్ కాడికి.

అరె ఎన్ని సార్లు వస్తాయి రా ఎలక్షన్స్ ఒక సంవత్సరం లా, వార్డ్ మెంబెర్ మున్సిపాలిటీ ఎలక్షన్ కాడికెల్లి mla, mp ఎలక్షన్స్ దాక దేనికి డబ్బులే రా భై, ఎలక్షన్ ని బట్టి పంచుతం రా. సంవత్సరానికి ఒక ఎలక్షన్ ఎసుకున్న ఖర్చు ఎంత అయితదో ఏర్కేనార కోటి అయితది రా నా ఏరియా ల పంచనికే యడికేల్లి తేవాలి రా భై, మా ఖర్మ బాలేక బై ఎలక్షన్ రాడమో, సిట్టింగ్ ఓడు పోయిండో ఇంకా అంతే సంగతులు మల్ల కోటి.

పోటి చేసేటోడు  ఏమిస్తాడు రా రెండు కోట్లు ఖర్చయ్యేకాడ కోటి ఇస్తాడు రా భై ఆడికీ తెలుసు ఎంత అయితదో, ఇప్పుడు మేము పెడితే నే గదా ఆడు గెల్చినాక కాంట్రాక్ట్స్ ఇస్తాడు. మాకు చిన్న కాంట్రాక్ట్స్ ఆడికి పెద్దయి, ఆడికి ఎయిర్పోర్ట్ లు మాకు రోడ్లు, వాడికి బొగ్గు గనులు మాకు ఆ బొగ్గు రవాణ  కాంట్రాక్టు అట్లనే ఉంటైరా. అరె గిది బి  ఒక బిజినెస్ ర భై. వేలు పెట్టినోడు లక్షలు సంపాదిస్తాడు లక్షలు పెట్టినాడు కోట్లు అంతేరా. డబ్బులు ఎవడికి చెడు రా అయినంత కాడికి తీస్కున్దమనె చూస్తాం గదరా భై.

అరె ఏముంది రా జనాలకు డబ్బులు కావలె రా అయి గూడా ఏమి పని చేయకుండా ఫ్రీ గ రావలె, అరె మేము ఒక వంద ఇస్తున్నమంటే ఎందుకిస్తం రా భై ఆడేమన్న నా చుట్టమా రేపు నేను గెల్చినంక అన్ని వసూలు  చేసుకోవాలి గదా. మల్లి వచ్చే ఎలక్షన్స్ గి గూడా పంచాలి గదా, ఒకసారి ఓడిపోయినా అనుకో ఎవడన్న నాకు డబ్బులు ఇస్తాదార మల్లి అన్ని గోడకేసిన సున్నం లెక్కనె గదరా. 


హైదరాబాద్ లో ఒక స్నేహితుడి పెళ్లి కోసం వెళ్ళిన నాకు పాత స్నేహితుడు కొత్త రాజకీయ నాయకుడికి జరిగిన సంభాషణ (వాడి సమాధానాలు మాత్రం ).



No comments: