చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ అంటే ఈనాడే. ఉదయాన్నే నిద్రలేచి ఈనాడు చదవకపోతే చాల వెలితి, సంవత్సరానికి ఊ రెండు సార్లు ఈనాడు రాకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టు మొన్నటి పేపర్ నిన్నటి పేపర్ తిరగేస్తూ ఉండేవాడని. ఇంకా ఆదివారం వచిందంటే వీక్లీ కోసం నేను చెల్లి కొట్టుకోడం ఇంకా గుర్తే :). సరే ఇప్పుడీ flashback ఎందుకంటే, నిన్న ఈనాడు లో వచ్చిన ఒక న్యూస్. తెలుగుని ప్రోత్సహిద్దాం తెలుగులోనే మాట్లాడడం అని దానికోసం తెలుగు పదకోశం పెంచడానికి ప్రజలకు తెలిసిన పదాలు వాటి తెలుగు translation పంపమని, సెలెక్ట్ అయిన పాదాలకు 5000 Rs/- బహుమానం ఇస్తామని దాని సారంశం. మరుసటి రోజు లిబియ లో జరిగిన ఒక సంఘటనకి సంబందించిన వార్త లో, ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని స్వతంత్ర సమరయోదుల కూడలి గా ప్రచురించారు, ఎక్కడి ట్రిపోలి ఎక్కడి స్వతంత్ర సమరయోదుల కూడలి, ఇదేదో కొంచెం వెరైటీ గ ఉండే అని గూగుల్ లో చుస్తే ఆ జరిగిన ప్రదేశం పేరు freedom fighters square అని ఉంది. మరి ఇలా నమవాచాకాలని కూడా తెలుగు లోకి తర్జుమా చేయడం నాకెందుకో కొంచెం వెరైటీ గ అని పించింది, ఇలాంటిదే ఒక జోక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా లో సుధాకర్ చూసా, నీ పేరేంటిరా అంటే 'temple steps rice piece king' అని చెప్తాడు అర్దంకాని సీతా, తెల్లబోయి చుస్తే పక్కేనే ఉన్న వాళ్ళెవరో చెప్తారు వాడి పేరు 'గుడి మెట్ల నుక రాజు ' అని. తెలుగు మిద అభిమానం ఉండటం కరెక్ట్, కానీ మరి ఇలా ప్రతిదాన్ని మార్చేస్తే చదివే వారికీ తెలుగు మిద అభిమానం బదులు ఆ న్యూస్ పేపర్ మిద వెటకారం ఎక్కువ అవుతుంది :)
No comments:
Post a Comment