Tuesday, September 18, 2012

petrol dhara malli perigindi

 పెట్రోల్  ధర మల్లి పెరిగిందా? కాదు కాదు పెంచార? మన ప్రభుత్వం ఏమి చేసిన  లోక కళ్యాణం కోసమే కదా అది ఈ పిచి జనాలకి ఎప్పటికి అర్దమవుద్దో. పెట్రోల్ ధర  పెంచడం వల్ల ఎన్ని లాభాలో రాస్తే ఓ బుక్ అవుద్ది  చెప్తే ఓ రోజవుద్ది. అన్ని చెప్పడం కష్టం కాని ప్రజలని విజ్ఞాన వంతులని చేయాలనే నా ఆశ  ని చంపుకోలేక  కొన్ని మాత్రం చెప్తా 

పెట్రోల్ ధర  పెరిగిందని జనాలందరూ సొంత వాహనాలు మాని  ప్రభుత్వ రవణా వాహనాలు వాడడం మొదలేడ్తే కాలుష్యం మొతం తగ్గిపోదు, తగ్గినా కాలుష్యం మన ఆరోగ్యాలు బాగుపడి హాస్పిటల్ కి వెళ్ళే ఖర్చు ఉండదు కద, ఇదివరకు పెట్రోల్ ధర తక్కువని పక్కనున్న పచారి కొట్టుకి కూడా బండిమీద  వెళ్ళే వాళ్ళు ఉబకయం సమస్యతో బాధపడకుండా చేసిన ఈ  పప్రబుత్వాన్ని వేనోళ్ళ  పొగడ కుండా ఉండగలమా, ఆ మాట కొస్తే పెట్రోల్  ధర  పెరిగిందని ధరలు పెరిగితే మనం తక్కువ  తిని ఆరోగ్యం గా ఉండాలనే కదా ఈ ప్రభుత్వ  తాపత్రయం.

Wednesday, April 4, 2012

End of a journey

All good things have to come to an end, yes its last week in my first company. So what is so special about it? doesn't it happen to everyone? everyone has to go through this phase at some point of time, what do they feel? first of all what makes people to leave their first company?  the company which helped them to groom both personally,professionally.
So here are my reasons why i wanted to move on-
The company you work should feel the employees are its strength not liability and should give them what ever they deserve if not pamper them and what my CEO said is "employees who are staying for long time here are like dead wood and fresh water flows" what do you expect after your CEO says this.This statement from him has created a sense of insecurity,frustration.This gave me the first hint, if want to be like dead wood stay here otherwise move on.
The second hint i got when i came back from my Malaysian assignment, to close the foreign travel request and to settle the amount it took nearly 3 months for me and i didn't get  salary for those 3 months.The people who are involved in settling the expenses felt like i have enjoyed the vacation for a year and i can wait for 3 more months to get the salary.No communication, no update, no response to mails, and to close the issue i got to escalate it to L3-manager and the issue got resolved after 3 months.So the issue got resolved after my L3 manager intervened in the matter and sent a mail saying do what ever i have asked for, then everything fell in place, and i felt this is heights of red tapism. For getting my salary why my l3-manager has to send a mail, am i a stupid? trying to explain the issue and the way it has to be solved??and that guy doesn't even bothered to listen until my manager sent a mail.I guess this is not the way to do deal with colleagues.

And then this happened - just to get more money from customer, we started delivering the solutions which are sub standard. I asked my manager is that fine? we would have done much better, we would have given them much better solution.The answer i got was let them comeback then we can give them not now, let the project run for some more time.

I met people who said 'don't train the freshers properly, don't give them all the details and make them good because they may leave the company once they learn everything', what a way of thinking. My company says they are correct and that is how it should be, i tried my best to convince but no body really cared.

Now a days recruiting is in its full swing and the ones they have recruited don't have the passion we had 4 yrs back, at least i feel they don't have, its just that they want salary at the end of the month and my company is happy with them. There is a famous dialogue in telugu 'think what you gave to the country and not what you got from it', probably that is what my company believes in.

So don't i know these thing for the past 4 years? hmm may be i know but i didn't care much about these things as   i was working on one of the finest projects i ever did, now things got changed and my first project no more exists, and even the money i earn here is almost half of what i get in other company, yeah money is not important if you are doing good work and you get the respect you deserve.

Initially i had the sense of  'my company' which no longer exists.If you don't feel its your own, you may let it go but if you own something you will try to go that extra mile and makes sure it gets done.

Hopefully the new company will not have all these ills :) :)
Hopefully i will not have time to look around and find the ills ;)




 
  

Friday, March 30, 2012

శబ్బాసు రా భరణి

తనికెళ్ళ భరణి గారు చిన్నప్పుడు మాతృదేవోభవ సినిమాలో విలన్ గా తర్వాత మనీ సినిమా లో కామెడీ విలన్ గా, మరికొన్ని సినిమాల్లో నటుడిగా మాత్రమే తెలుసు, కొంచెం పెద్దయ్యాక అయన రచయత అని లేడీస్ టైలోర్ సినిమా కి కథ తనే రాసారని తెలిసింది, ఇంకా చాల సినిమా లకి కథలు మాటలు రాసారని చదివా. ఇలా ఆయనగుర్చి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోడం అయన మిద గౌరవం అభిమానం నాతొ పతే పెరుగుతూ వచాయి.  అప్పుదెప్పుడో గ్రహణం అనే సినిమా తీసారని అందులో భరణి గారు ఉన్నారని విన్నాను (ఇంకా చూడలేదు). ఆ మధ్య నక్షత్ర దర్శనం అనే కవిత సంపుటి విడుదల చేసారని తెల్సి ఎలాగైనా చదవాలని అప్పటికి అనుకోని మరు రోజు మర్చిపోయి నా పనుల్లో నేను మునిగిపోయి ఉన్న. మొన్న ఓపెన్ హార్ట్ విత్ RK అనే కార్యక్రమం లో భరణి గారి ఇంటర్వ్యూ చూసి ఆయనగారి మిద ఉన్న అభిమానం పదిన్తలయింది. బాలు గారి పుణ్యమా అని మొన్న శివరాత్రి ముందు రోజు పాడుతా తీయగా కార్యక్రమానికి అతిథి గా వచ్చి శభాసు రా శంకర అని  శివ స్తుతి చేస్తూ తెలంగాణా యాసలో శివునిపై పద్యాలూ చదవడం మొదలెట్టారు. నాలాంటి పద్యాల మీద ఆసక్తి ఉండి పాదానికి పది సార్లు brown నిఘంటువు చూసే వాళ్ళకి కూడా వెంటనే అర్ధమయ్యేలా ఆ పరమేశ్వరుని తత్వలని  చిన్న చిన్న పద్యాలుగా  వినేప్పటికి  ఈ  పుస్తకమైన  చదవాలనే  కుతూహలం మొదలయింది. Internet లో ఏదో చూస్తుంటే  kinige website లో పుస్తకాల గురించి  తెలుసుకొని ఈ పుస్తకం ఉందేమో చూసా, top selling books లో చూసి  వెంటనే కొనేసి గంట  లో ఉన్న 65 pages  పూర్తీ చేశా  (తెలంగాణా యాస లో రాసిన ఏదో నాక్కొంచెం తెలంగాణా యాస మిద పట్టు ఉండడంతో చదవడం సులభం అయింది). 

పెద్ద పెద్ద విషయాలని కూడా చిన్న చిన్న పదాలతో నాలాంటి వాళ్ళకి కూడా తత్వం వంటపట్టేల ఉన్నాయా పద్యాలూ (ఏమో వాటిని పద్యాలూ అనోచో కూడా నాకు తెలిదు)

అందులోని మూడు తత్వాలు (అన్ని బాగా ఉన్నాయి ఏదో మచుకి ఓ మూడు)

ఆదా చంద్రమ నెత్తిమీద 
నీలో ఆదా ఏమో అమ్మాయే
పురా జ్ఞానివి నీకు సాటి ఎవరురా 
శభాసు రా శంకర 

అమ్మని చుస్తే ఆకలి 
గంగామ్మని చుస్తే దూపు
అయ్యని చుస్తే బెఫికరు 
శభాసు రా శంకర 

ఎన్నో గుళ్ళల్లో దేవులాడి 
యష్టోచి కూర్చుంటే 
నా గుండెలో ఘల్లుమన్నావు లే 
శభాసు రా శంకర 

చదవడం పూర్తైన వెంటనే భరణి గారి మిద నాకున్న గోరంత అభిమానం కొండంత అయింది.ఆ కొండంత అభిమానం కింద నాలుగు లైన్లు రాసేలా చేసింది. 

ఎంత సక్కగా రాస్తివిరో శివుని గూర్చి 
విన్నాడంటే వాడు కరిగిపోతడీమో 
కాటి నొదిలి నీ కాడికి వస్తాడేమో 
శభాసు రా భరణి  

Thursday, March 8, 2012

బిస్కిట్ బాబు తో బాబు

శ్రీ లక్ష్మి గణపతి ఫిల్మ్స్ బిస్కెట్ బాబు తో బాబు -- గొప్ప action stunts suspense కలగలిసిన గొప్ప చారిత్రాత్మక
చిత్రం. బిస్కెట్ బాబు మా TM కి నేను పెట్టుకున్న ముద్దు పేరు.  గత మూడు సంవత్సరాలనుండి ఒకటే మాట అంటే అదేదో మాటమీద నిలబడే రకం అని కాదు, ఎవడు రాజీనామా చేయడానికి తయారైన అవే మాటలు  , customer ని గురించి భయంకరమైన feedback ఇచాడు నువ్వు లేకపోతె ఈ కంపెనీ లో ఒక దివిసన్ మూస్కోడమే, onsite పంపిస్తా, ఎం కావాలి చెప్పు ఆ చంద్రున్ని దింపమంటావా, లేకపోతె మార్స్ మీదకి ఓ జూలీ ట్రిప్ వెళ్లి వస్తావా చెప్పు ఎం కావాలి అంటూ అసలు జరగవని తెలిసిన అన్ని విషయాలు ఏకరవు పెట్టడం మొదలెడతాడు. ఎలా తెలిసొందో తెలిదు నేను కూడా రాజీనామా కి రెడీ అయ్యా అనే దృగ్విషయాన్ని పసిగట్టాడు,బహుశా భూకంపం వస్తుందని కుక్కకి employee resign చేస్తున్నాడని managers కి నాచురల్ గానే  తెలిసిపోద్దేమో.కొన్ని బిస్కెట్స్ వేయడానికి పిలిచాడు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉండడం వళ్ళ అయన ప్రశ్నలకి ఎలాంటి సమాదానం చెప్తే తొందరగా పని ముగించ వచ్చో ముందే ఒక పకడ్బంది వ్యూహం తో రెడీ గా ఉన్నా.

రొటీన్ కి భిన్నంగా నేను కాన్ఫరెన్స్ రూం అనబడే గోడౌన్ లోకి వెళ్ళగానే, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అని ఒక దీన మైన చూపు చూసాడు. కూర్చో అన్నట్టు చైర్ వైపు చూసాడు. పర్లేదు అని నిల్చోనే ఉన్నా త్వరగా వెళ్లి పోవచనే కక్కుర్తి తో. కూర్చో అని బాధగా చూసి నోటితో చెప్పేసరికి మరి బాగోదని కూర్చుంది పోయా. త్రిల్లెర్ మూవీ చూడానికి వెళ్లి టికెట్స్ దొరక్క పక్కనే ఉన్నా సెంటిమెంట్ మూవీ చూడడానికి వేల్లినోది లా తయారైంది నా పరిస్తితి. ఆయనతో యుద్ధం చేద్దాం అని కదన కుతూహలం తో బయలుదేరిన నాకు అయన మొహం చూసి ఎం మాట్లాడబుద్ది కాలేదు. రెగ్యులర్ గా అయన చెప్పే hikes , onsite లాంటివి మాట్లాడకుండా, ఎమైన చేస్తే ఉంటావా అని అడిగాడు, లేదు అన్నాను అంతే రెండు నిమిషాల్లో అయిపొయింది. ఆయనతో మాట్లాడడం ఆక్షన్ మూవీ లా ఉంటాదనుకున్న నేను ఇంట ప్రశాంతంగా సుఖాంతం అయ్యే సరికి ఆనందం గా బయటికొచ్చా.             
             

హోలీ కథ

పండగలంటే నా చిన్నప్పుడే, ఏదో హడావిడి excitement కొత్త బట్టలు,తల స్నానాలు, అమ్మ చేసే గారెలు. అన్ని పండగల్లో హోలీ మాత్రం సేపరాటే. కొత్త బట్టలు వేసుకొనే దైర్యం ఎవరు చేయరేమో. చిన్నప్పుడు నాన్నారు కల్లూరు లో ఉద్యోగం చేసేప్పుడు, కాంపస్ మొత్తం ఒక చోట చేరి పండగ చేసే వాళ్ళం. చైతు నేను సందీప్ అందరం కలిసి బాటిల్స్ లో వాటర్ కలర్స్ నింపేసి చల్లుకునేవాళ్ళం. నాన్న వాళ్ళతో కాంపస్ మొత్తం తిరుగుతూ అందర్నీ నిద్ర లేపి మరి రంగులు చాల్లే వాళ్ళం, ఉత్సాహవంతులు మాతో పటు మిగితా వాళ్ళ ఇంటికి వచేవాళ్ళు కొంతమంది లోపలే ఉండి లేమని పెద్ద వాళ్ళతో లేము అని చెప్పించే వాళ్ళు అలంటి వాళ్ళని ఎం చేయలేం అనుకోని లైట్ తీస్కోనే వాళ్ళం. నాన్నది  residential స్కూల్ కావడం తో స్టూడెంట్స్ అందరు ఇలాంటి అదృష్టం కోసం చూసేవాళ్ళు, వాళ్ళ టీచర్స్ మిద ఉన్న కసి అంతా హోలీ రోజు తీర్చుకునే వాళ్ళు. (నాన్న ఎప్పుడు స్టూడెంట్స్ ఫేవరెట్ సో నాన్న కి ఎప్పుడు ఆ అదృష్టం దొరకలేదు :)).ఇలా మధ్యానం వరకు రంగులు చల్లేస్కోని చొక్కాలు చిచేస్కోని ఇంటికి రాగానే తాతయ్య ఎంత అవతారం అనే చూపులని తప్పించ్కుంటూ పెరట్లోకి వెళ్లి అమ్మ చేతో తల స్నానం చేపించుకొని అయిపోయిదని పించుకొనే వాళ్ళం.అప్పట్లో గుడ్లు (eggs) కూడా రంగుల బదులు వాదోచు అనేంత జ్ఞానం లేకపోడం వాళ్ళ రంగులతో సరిపెట్టేసే వాళ్ళం (అప్పట్లో గుడ్డు అంటేనే అదేదో బ్రహ్మ పదార్దం అని మనం అలాంటివి తినడం కాదుకదా తాకినా తప్పే అనే తాతయ్య మాటలతో గుడ్డు వాడెంత జ్ఞానం లేదు).
కొంచెం ఎదిగాక ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ లో ఉంటున్న రోజుల్లో అప్పుడే కొత్తగా వచ్చిన స్వాతంత్రం, చేతిలో డబ్బులు, చుట్టూ స్నేహితులు సో పండగని పీక్ లో ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఇంటి పక్కనే ఉండే శ్రీను, రమణ ల తో కలిసి మా రూమీస్ తంగరాజ్,రాకేశ్ రాచ చేసే వాళ్ళం మాతో మా ఇంటి owner పిల్లలు కూడా కలిసే వాళ్ళు.అప్పుడే హోలీ కి రంగుల బదులు కోకాకోల,పెప్సి లాంటి రసాయనాలతో గుడ్డు లాంటి పదార్దాలు కూడా వాడవచని తెలుసుకున్న. మేమే కాకుండా మొత్తం షాదన్ కాలేజీ ఫ్రెండ్స్ అందర్నీ లారీల్లో తీస్కోచేవారు తంగ రాకేశ్, ఇంకా చెప్పేదేముంది తీస్కున్నోడికి తీస్కున్నత పుసుకున్నోడికి పుసుకున్నంత.హోలీ అదెప్పుడు పండగ చేసే owner మాత్రం స్నానం చేసేప్పుడు నిల్లు తక్కువగా వాడండి బాబు అసలే ఎండా కాలం అనేవాడు, అలాగే అంది అనేసి ఒక్కోడు గంట చొప్పున స్నానం చేసేవాళ్ళం.అంతా అవగానే సంగు భాయి బిర్యాని అనేవాడు పక్కనే ఉండే బావర్చి నుంచి పార్సెల్.ఇలా సాయంత్రం వరకు జీవితాన్ని ఎంజాయ్ చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మల్లి కాలేజీ.

ఇంకా   బాగా ఎదిగి మాస్టర్స్ కోసం గుజరాత్ కి మకాం మార్చాక హోలీ ఎంత పెద్ద పండగో తెలుసుకున్న,కేవలం రంగులతో, గుడ్లతో కాకుండా ఖర్చు లేకుండా హోలీ జరుపుకునే కొత్త పద్ధతి తెలిసింది ఇక్కడే.బురదలో కూడా బాల్ లేకుండా football ఆడడం కూడా తెలిసింది ఇక్కడే. కాలేజీ క్రికెట్ గ్రౌండ్ కి జనాలందరినీ గుంపులు గుంపులు గా తీస్కోచి అందర్నీ లైను లో నిల్చోబెట్టి తప ఆన్ చేసే వాళ్ళు మొదట్లో బుద్ది నిల్చున్న వాళ్ళందరూ ఓ పది నిమిషాల్లో బాగా తాగేసి ఊగే వాళ్ళలా పక్కవాళ్ళ మీద  పడడం, పక్కవాళ్ళు కింద పడడం వాళ్ళ మీద విల్లు పడడం క్షణాల్లో జరిగి పోయేవి. నా లాంటి అర్భకులని కూడా మధ్యలో ఎక్కడో మూట కట్టి పదేసేవాళ్ళు.కాలేజీ ఫెస్ట్ కి ఇచిన tshirt జనాలందరూ హోలీ కి వాడేవారు, మాములు రోజుల్లో అయితే దాన్ని చిమ్పడం కష్టమని. ఇలా స్టార్ట్ అయ్యే హోలీ matki  phod అని కృష్ణాష్టమి ఉట్టి కొట్టడం లాంటి దాంతో కంటిన్యూ అయ్యేది, హాస్టల్ లో వింగ్ కి ఒక టీం చొప్పున తక్కువ టైం లో ఉట్టి కొట్టే టీం ఆ రోజు కి విన్నెర్.అలా రోజంతా బురదలో పొర్లి mud bath లాంటిది చేసి రూం కి వెళ్లి వాటర్ బాత్ చేసే వాళ్ళం.
కాలేజీ నుంచి ఉద్యోగం లో జాయిన్ అయ్యాక వచ్చిన హోలీ కి HR ఒక చిన్న ముంత లో కుంకుమ ఇంకో దాంట్లో పసుపు తీస్కోచి టీం మేట్స్ అందర్నీ లైన్ లో నిల్చోబెట్టి హ్యాపీ హోలీ అని ఓ చెంపని రెడ్ ఇంకో దాన్ని ఎల్లో చేసిది,మేము చేసేదేం లేక ఆమె తెచిన పసుపు-కుంకుమ లని ఆమెకి కూడా పూసి హ్యాపీ హోలీ అని మేనేజర్ తో సహా అందరికి చెప్పి తిరిగేల్లి సీట్ లో కూర్చొని పని చుస్కోడం. తను పూసిన ఆ పసుపు కుమ్కుమకే ఇప్పుడు అయ్యో అందం పడిపోయిందే అనుకునే ఆడ colleagues చిన్నగా  ఉన్నప్పటి ఉత్సాహం లేదు colleage టైం లో ఉన్న హుషారు లేదు, ఏదో హోలీ రోజు రంగులు పుసుకోవాలి అని namesake ఏదో మమ అనిపించడం అంతే.  


ఇలా రంగులు,నీళ్ళతో మొదలైన హోలీ గుడ్లతో, బురదతో కంటిన్యూ అయి పసుపు కుంకుమ రేంజ్ కి చేరుకుంది.
హ్యాపీ హోలీ bytheway :) :)



Monday, December 5, 2011

అనగనగా ఓ SOC


onsite నుంచి రాగానే,అందరి లాగే chacolates @ mydesk అని మెయిల్ పెట్టా. ఎప్పుడు ఏది ఫ్రీ గ వస్తుంది అని ఎదురు చూసే నా TM తన సంచి త్జో సహా వచేసాడు, సరేలే మన TM ఈ కదా ఓ నాలుగు ఎక్కువ తీస్కున్న పర్లేదు అని చూస్తున్న నాకు షాక్ ఇస్తూ 4 మిగిల్చాడు, ప్రాజెక్ట్ లో మిగిలిన 16 మందికి. మిగిలిన నాలుగిట్ని౧౬ ముక్కలు చేసి తిరుపతి ప్రసాదం లా పంచా, ఈ పాటి ముక్క కి మళ్ళి మెయిల్ బొక్క అని కొంత మంది మనసులో (నాకు వినపడేలా...) అనుకుని ముక్క నోట్లో వేసుకొని, ముక్క (అదే chacolate ముక్క) దాత సుఖీభవ అని దీవించి వారి వారి ఉచితాసనలలో ఆసీనులై, ఎప్పట్లాగే మానిటర్ ని చూస్తూ mouse ని కదిలిస్తూ ప్రపంచాన్ని ఆ mouse కదలికలతో కంట్రోల్ చేస్తున్నంత buildup తో పనిలో మునిగిపోయారు. ఒక సంవత్సరం తర్వాత ఇండియా ఆఫీసు వచేసరికి ఊరిమే ఉత్సాహంతో కాంపస్ మొత్తం తిరుగుదామని బయల్దేరిన నాకు ఎదురుగ TM . శకునం బాలేదని వెళ్లి నా cubicle లో కూర్చున్న. వెంటనే ఆయనే నా cube కి వచ్చి నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు. నాకు మీకు పర్సనల్ ఎంటి అనబోయి, మాట్లాడేది TM తో అని గుర్తొచ్చి మాటని మింగేసి అడుగు ముందుకువేసా. పాత NTR సినిమా  లో విల్లన్ డెన్ లా ఉండే ఆ కాన్ఫెరెన్స్ రూం కి వెళ్తూనే ఏవో చిన్న నాటి (అంటే ఓ సంవత్సరం ముందువి) చిలిపి పనులు గుర్తొచ్చి నవ్వుతున్న నన్ను ఒక ఇయర్ అరణ్యవాసం పంపిన నీకు బుద్ది రాలేదు అని ఆయనో చూపు, సమాధానంగా కుక్క తోక వంకర అన్నట్టు నేనో చూపు, వీడితో కళ్ళతో మాట్లాడితే క్లారిటీ లేదని నోటితో మాట్లాడడం మొదలెట్టాడు.


ఎప్పట్లాగే, అందరు managers లాగే you are very important resource, we have got very good feedback from customer about you, i want to give you the best work in the industry. next we are gonna work in a SOC project. Its state-of-the ఆర్ట్ SOC project, our company future is dependent on that projects success. అని ఆల్రెడీ బాగా prepare అయిపోయిన ఒక పేరాగ్రాఫ్ ని అప్పజెప్పి ఓ రెండు గ్లాసుల నిల్లు తాగాడు. నూతన్ ప్రసాద్ దేశం క్లిష్టపరిస్తితిలో ఉంది అని డైలాగ్ గుర్తొచ్చి వెంటనే నవ్వోచి ఇప్పుడు కూడా నవ్వితే అయన ఎదుస్తాదేమో అని గుర్తొచ్చి ఆయనలాగే గంబిరంగా పేస్ పెట్టి ఉందా అయిపోయిందా అనట్టు చూస్తున్న నా వైపు అప్పుడేనా అన్నట్టు ఓ నవ్వు నవ్వి, ప్రాజెక్ట్ గురించి చెప్పడం మొదలెట్టాడు. మొదటి రోజే ఏంట్రా ఈ మోత అని మనసులో అనుకోని ఎంత బాగా చెప్తున్నారో అన్నట్టు చూస్తున్న నాతో so i hope you will be interested in this project, i will finalize your name and will inform everyone that you will be working in this project, from afternoon you can start working అంటూ ఈ రోజు కి ఇంతే సంగతులు అని న్యూస్ రీడర్ వార్తలు చదివినట్టు చెప్పేసి do you have anything to ask అంటూ ఎదవ ప్రశ్నవేసాడు, ఆల్రెడీ ఆకలిగా ఉన్న నేను మళ్ళి ఎడిన అడిగితె లంచ్ బ్రేక్ లో కూడా బ్రేక్ లేకుండా మాట్లాడగల అయన నైపుణ్యాన్ని తెలిసిన వాడ్ని కాబట్టి లేదు మహా ప్రభో మీరు ఎలా అంటే అలాగే అని బయటికి నడిచా.


అయన చెప్పినదాన్ని బట్టి చుస్తే అసలు ఇంట మంచి అవకాశం  మళ్ళి రాదేమో అనిపించింది. సరేలే ఇప్పటి వరకు ఇలాంటి project చేయలేదు కదా మనకు బాగా ఉంటది  అని ఆనందంగా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే పక్కనుండే ponnu (అరవం లో అమ్మాయి) చిలిపిగా చూస్తూ వెకిలిగా నవ్వినప్పుడైన గుర్తుపత్తల్సింది ఎక్కడో ఏదో తేడ జరిగుతుంది అని. లోకంలో నమ్మలేనిది ముగ్గురు Salesmen , Politicians  , Managers అన్న సత్యాన్ని నిజం చేస్తూ, అయన నిజ స్వరూపం త్వరలోనే తెలిసొచ్చింది

ప్రాజెక్ట్ మొదలైన మూడో రోజు నుంచే

రోజుకో రెండు స్టేటస్ కాల్స్ అంట, ఏనుగులతో తొక్కించాలి ఒప్పుకున్నా వాడ్ని.....
మేనేజర్ కి తెలివి లేదు lead కి బుర్రే లేదు....
దీనికి  తోడు భత్రుహరి చెప్పినట్టు ముర్ఖుడ్ని మార్చలేం అనేందుకు example గా బాగా తెలివైన ఒక భీకర consultant ,

పరమానందయ్య శిష్యులు ఎంత తెలివైన వాళ్ళో చూడలేదు కానీ, మరో ప్రదేశం లో పని చేస్తున్న ఆ engineers  మాత్రం వాళ్ళని మించి పోయే తెలివితేటలు కలిగి ఉన్నారు.

చూడాలి ఎన్ని రోజులో ఇలా.............





Monday, October 10, 2011

Im back

yes im back, back to wipro after a year of being in wat i feel is hell, i was thinking i am back to where i belong, well i get connected with everthing and wil have a bond with each and everything let it b my chair or sitting place or the people around my place, this may seem stupid for some :)

well after i m back i couldn't see anyone i know, except my manager and this place no more seems the same which i left a year back.no one to talk with during coffee time, no one to go out on a walk around the campus after lunch, no one to poke. No moche, no bobby, no mama, no mam, no vipin,harish, imtiyaz, sriram all left, some for some other onsite, someof  them left the company. i am sure i m not gonna get any team  like that again. all the old memories started pouring in after coming to my cubicle after a year.    
probably it takes another week or so for things to get settled. may b 2/3 more posts in this blog before becoming busy again :)